Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని సింగాపూర్ గ్రామంలో నీరటి రమేష్(45) అనే వ్యక్తి వడదెబ్బతో మృతి చెందాడు. రెండు రోజులుగా పనుల నిమిత్తం ఎండలో బాగా తిరగడం వల్ల మంగళవారం అస్వస్థకు గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన నీరటి రమేష్ కుటుంబ సభ్యులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకొని అండగా నిలవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.





