
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
తెలంగాణ రాష్ట్ర మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని బండ శ్రీనివాస్ ఆదివారం హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. కెసిఆర్ కు పుష్ప గుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్, హుజురాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు పాడి కౌశిరెడ్డిలను తెలంగాణ భవన్లో కలువగా వారు శ్రీనివాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.








