
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
కరీంనగర్ ఎంపీగా భారీ మెజార్టీతో బండి సంజయ్ విజయం సాధించారు. ఈ మేరకు కరీంనగర్ ఎస్ ఆర్ఆర్ కాలేజీలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సర్టిఫికెట్ ను బండి సంజయ్ కు అందజేశారు. బిజెపి అభ్యర్థి బండి సంజయ్ రెండు లక్షల 25 వేల209 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గత ఎన్నికల కన్నా ఈసారి భారీ మెజార్టీతో గెలుపొంది పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బిజెపికి గట్టి పునాది వేశారు.






