
స్వర్ణోదయము ప్రతినిధి, విజయవాడ: ఓ అంగన్వాడీ టీచర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అనూహ్య రీతిలో ఎమ్మెల్యేగా విజయం సాధించి ఔరా అనిపించుకున్నారు. వివరాలలోకి వెళితే.. రంపచోడవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మిరియాల శిరీషాదేవి గెలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మికి 80,948 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అంగన్వాడీ టీచర్ శిరీషకు 90,087 ఓట్లు వచ్చాయి. తన ప్రత్యర్థిపై శిరీష 9,139 ఓట్ల మెజార్టీతో గెలిచారు. వైసీపీ కంచుకోటను బద్దలుగొట్టడమే కాకుండా మరో రికార్డు సృష్టించారు. గతంలో శిరీష అంగన్వాడీ టీచర్ గా పని చేయగా, ఇప్పుడే ఎమ్మెల్యేగా గెలచి అసెంబ్లీకి వెళ్లనున్నారు. అంగనవాడి టీచర్ ఎమ్మెల్యేగా గెలవడంతో ఆ ప్రాంత ప్రజలు హర్షం వెలిబుచ్చారు.






