
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజూరాబాద్ మండలం బోర్నపల్లి గ్రామానికి చెందిన మొగ్ధంపురం
అనిల్ ఇటీవల జీవితంపై కలత చెంది ఆత్మహత్యకు పాల్పడగా ఆయన కుటుంబానికి ప్రముఖ సామాజికవేత్త, హెచ్ సి ఎల్ సీనియర్ డైరెక్టర్ సబ్బని వెంకట్ బియ్యం వితరణ చేశారు. అనిల్ కుటుంబ దీనస్థితిని తెలుసుకొన్న సామాజికవేత్త హెచ్ సిఎల్ డైరెక్టర్ సబ్బని వెంకట్ ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తన అనుచరుల ద్వారా ఒక క్వింటాల్ బియ్యాన్ని అందజేశారు. మృతునికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. వారికి సహాయ సహకారాలు అందిస్తానని వెంకట్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకట్ అనుచరులు మేడుదుల అర్జున్ యాదవ్, జూపాక నర్సింగ్, పిట్టల రాజు, కేశబోయిన
అజయ్ తదితరులు పాల్గొన్నారు.






