
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ అనారోగ్యంతో నిన్న మరణించగా ఆయన భౌతిక కాయాన్ని హుజురాబాద్ శాసన సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి మంగళవారం సందర్శించి మృతదేహం పై పూలమాలలు వేసి నివాళులర్పించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ను తన సోదరుడు మృతి చెందిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేశారు.







