
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త, అంగన్వాడి టీచర్ కోటోజు జ్యోతిరాణి తన కుమారుడు సాయికిరీటి 25వ జన్మదినము సందర్భంగా హుజురాబాద్ సివిల్ కోర్టు జడ్జి పద్మ సాయిశ్రీ కి మొక్కను అందజేశారు. మొక్కలు నాటడం వల్ల పర్యావరణం పరిరక్షించబడుతుందని, అందరు ఇలాగే శుభదినాలు, పండుగ దినాలు, పుట్టినరోజుల సందర్భంగా మొక్కలు నాటాలని జడ్జి సాయిశ్రీ పిలుపునిచ్చారు. విరివిగా మొక్కలు నాటడం వల్ల భవిష్యత్తు కాలంలో ఇలాంటి విపత్తులు రాకుండా మానవ జాతిని కాపాడుతుంది అన్నారు.
