
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్ :
ఛత్తీస్ ఘడ్ విద్యుత్ కొనుగోలు విషయంలో బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ అయ్యాయి. ఎన్నికల దృష్ట్యా జూలై 30 వరకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కోరారు. కానీ ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలంటూ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటిసుల్లో స్పష్టం చేశారు. యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణకు జస్టిస్ నరసింహారెడ్డి కమిటీని ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం వేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ విచారణ చివరి వరకు ఎటు మలుపులు తిరిగి ఎవరికీ చుట్టు కుంటుందోనని అప్పటి విద్యుత్ ఉన్నత అధికారులు ఆందోళన చెందుతున్నారు.






