మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
హుజురాబాదులోని 33/11 KV హుజురాబాద్ సబ్ స్టేషన్ కార్యాలయ ఆవరణలో ఈ నెల 15న విద్యుత్ వినియోగదారుల లోకల్ కోర్టు ఏర్పరచినట్లు TGNPDCL విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్పర్సన్ CGRF-I, చైర్పర్సన్ (FAC), K.N. గుట్ట తెలిపారు. ఈ లోకల్ కోర్టులో విద్యుత్ పునరుద్ధరణ, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు మార్చటం. వోల్టేజి హెచ్చుతగ్గులు. డిస్ట్రిబ్యూషన్ సిస్టం పెంపుదల, లోపాలు ఉన్న మీటర్లు మ్మార్చడం, నూతన సర్వీసుల మంజూరు, అదనపు లోడ్ క్రమబద్ధీకరణ, సర్వీసు పేరు మార్పు వాడకానికన్న హెచ్చు మొత్తంతో గల బిల్లులు, కేటగిరి హజురాబాద్, కేశవపట్నం మరియు సైదాపూర్ మండలాలలో మార్పు, సర్వీస్ రద్దు మొదలగు వాటికి సంబందించి, విద్యుత్ వినియోగదారులు మండలాల వారీగా వ్రాతపూర్వకంగా తమ ఫిర్యాదులు అందించవచ్చునని తెలిపారు. ఈ ఫిర్యాదులు ఉదయం గం.10.30 నుండి మధ్యాహ్నం గం.1.00 వరకు స్వీకరించడం జరుగుతుందని అన్నారు . కావున TGNPDCL విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చైర్ పర్సన్ గుట్ట కోరారు. ఈ కార్యక్రమానికి R చరణ్ దాస్ (సభ్యుడు-ఫైనాన్స్); మరియు ఎన్. నరేందర్ (స్వతంత్ర సభ్యుడు),(కె.ఎన్. గుట్ట) చైర్పర్సన్ (ఎఫ్ఎసి), సిజిఆర్ఎఫ్-ఎల్ టిజిఎన్పిడిసిఎల్, వరంగల్ హాజరవుతారన్నారు.





