
–బంధన్ హాస్పిటల్ ప్రారంభించిన మంత్రులు
స్వర్ణోదయం ప్రతినిధి, వరంగల్: పేదలందరికి వైద్యులు వ్యాపార దృష్టితో కాకుండ సేవా దృక్పధంతో వైద్యం అందించేందుకు ముందుకు రావాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, గ్రామీణాభివృద్ధి, పంచాయత్ రాజ్ శాఖ మంత్రి సీతక్కలు అన్నారు. సోమవారం హనుమకొండ పద్మాక్షి గుట్ట వైపు వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన బంధన్ ఆసుపత్రిని మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. ఉన్నత చదువులు చదువుకుని విదేశాలకు వెళ్లకుండా స్వంత ప్రాంతంలో ఉన్నత వర్గాలతో పాటు పేదలకు వైద్యం అందించాలన్న ఆశయంతో ఏర్పాటు చేసిన ఆసుపత్రి అందరికి అందుబాటులో ఉంచాలని చెప్పారు. ప్రభుత్వం నిర్దేశం చేసిన విధంగా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్పొరేట్ వైద్యం అందించి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు వెళ్లే అవకాశం లేకుండా వైద్యం అందించాలని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మోహన్ దాస్. డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివ రావు, డాక్టర్ పోలా నటరాజ్. డాక్టర్ సుధాకర్. డాక్టర్ ఉదయ్ సింగ్. డాక్టర్ తిరుపతి రెడ్డి డాక్టర్ భీమగాని లక్ష్మీనారాయణ, డాక్టర్ కాళిప్రసాద్, డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ లక్ష్మణ్, శ్రీవాని, నవీన్ రెడ్డి, ప్రియదర్శిని రెడ్డి, రమేష్ గౌడ్. జయశ్రీ గౌడ్, త్రినాధ్ గౌడ్, మౌన గౌడ్ లను మంత్రులు ఘనంగా సత్కరించారు.







