
–బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కని సంజయ్ కుమార్.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, బీసీ రాజకీయ పోరాట సమితి అసెంబ్లీ అధ్యక్షులు చిలుకమారి శ్రీనివాస్ అధ్వర్యంలో నూతనంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన జక్కని సంజయ్ కుమార్ కి సన్మానసభ నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కని సంజయ్ కుమార్ మాట్లాడుతూ బీసీల హక్కుల సాధన కోసం ఎంతటి పొరాటానికైన సిద్ధమేనని, గత 77 సంవత్సరాల నుండి బీసీలకు సరియైన గుర్తింపు, రాజ్యాధికారం దక్కడం లేదని ఆయన ఆవేదన వెల్లిబుచ్చారు. ఇకనుండి గ్రామ గ్రామాన బీసీలను కలుస్తూ సంఘటిత పరుస్తూ బీసీలను రాజ్యాధికార దిశగా కార్యముకులను చేయడమే తన ముందున్న ప్రధాన కర్తవ్యమని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు సముచిత స్థానం కల్పించాలని, బీసీలను ఓటు బ్యాంకుగా చూసే విధానం పోవాలని ఆయన ఆకాంక్షించారు. ఇకముందు బీసీలకు ఏలాంటి సమస్యలున్న బీసీలను సంఘటితం చేస్తూ బీసీల పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజకీయ పోరాట సమితి అసెంబ్లీ ప్రధాన కార్యదర్శిగా కూరపాటి రామచంద్రం, మండల ప్రధాన కార్యదర్శిగా కోమటి శ్రీనివాస్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజకీయ పోరాట సమితి హుజురాబాద్ మండల అధ్యక్షులు పంజాల తిరుపతి గౌడ్, వీణవంక మండల అధ్యక్షులు వడ్డేపల్లి రాజగోపాల్, యువజన విభాగం రాష్ట్ర నాయకులు బోయినపల్లి సాయిచంద్, బీసీ నాయకులు సంగెం సత్యనారాయణ, శ్రవణ్, సాయి, వీరబోయిన వేణు, న్యాలి కుమార్, పల్లెబోయిన రాజుకుమార్, రాజకోమురయ్య, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

