
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: నులిపురుగుల నివారణ కోసం ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందించే మాత్రలను వేసుకోవాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ అన్నారు. గురువారం హుసురాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని ఆల్బెండజోల్ మాత్రలను విద్యార్థులకు వేసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ మాత్రలను 1 నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా వేయాలని దానికి తల్లిదండ్రులు సహకరించాలని అన్నారు. మాత్రలు వేయడం ద్వారా పిల్లల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, కౌన్సిలర్ కల్లేపల్లి రమాదేవి, కమిషనర్ సల్వాది సమ్మయ్య, డిప్యూటీ డిఏం హెచ్ఓ డాక్టర్ చందు నాయక్, వైద్యాధికారులు డాక్టర్ మధుకర్, డాక్టర్ జరీనా, ఎస్ హెచ్ ఓ సాజీద్, కిషన్ రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







