
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అప్పోయింట్మెంట్ కోరడం జరిగిందనీ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నలకుంట పోలీస్ స్టేషన్ లో అయన మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఐక్య యువజన, విద్యార్థి సంఘాల నాయకులు అందరం కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించి నిరసన తెలిపే ప్రయత్నం చేశామన్నారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నీట్ విద్యార్థుల పక్షాన వారి డిమాండ్ లను మోదీ దృష్టికి తీసుకెళ్ళాలని కోరారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్ష రద్దు చేసి మళ్ళి నిర్వహించాలనీ డిమాండ్ చేశారు. NTA నీ రద్దు చేసి జరిగిన పేపర్ లీకేజీ పై సుప్రీం కోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. నీట్ పరీక్ష రాసిన 24లక్షల మంది విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు కేంద్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మన తెలుగు రాష్ట్రాల నుండి కూడా 60 వేలకు పైనే విద్యార్థులు నీట్ పరీక్ష రాశారనీ, వారికి అలాగే దేశ వ్యాప్తంగా రాసిన 24లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలనీ కోరారు. నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించే వరకు విద్యార్థులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందనీ హెచ్చరించారు. కార్యక్రమంలో పాల్గొన్న సంఘాల నాయకులు ఏఐఎస్ఎఫ్ నాయకుడు పుట్ట లక్ష్మణ్, క్రాంతి, ఎస్ఎఫ్ఐ నాయకుడు రజనీకాంత్, విజేఎస్ మాసంపల్లి అరుణ్ కుమార్, పిడిఎస్యు నేతలు రామకృష్ణ, ఎస్ నాగేశ్వరరావు, శ్రీకాంత్, ఏ ఐ వై ఎఫ్ నాయకులు కె ధర్మేంద్ర, శ్రీకాంత్, డి ఎఫ్ వై కోట రమేష్, పి వై ఎల్ ప్రదీప్, ఎన్ ఎస్ యుఐ సిటీ ప్రెసిడెంట్ అభిజిత్ యాదవ్, రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు పవన్, శ్రీకర్ ,విధుర్, కుందన్ యాదవ్, వినోద్ తో పాటు

ఈ ముట్టడి కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువజన, విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






