
స్వర్ణ ఉదయం ప్రతినిధి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నూతన స్పీకర్ గా ఎన్నికైనటువంటి చింతకాయల అయ్యన్నపాత్రుడుని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్ శనివారం విజయవాడలో కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చంతో సత్కరించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ…40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ మచ్చ లేని నాయకులు అయ్యన్నపాత్రుడు ఆని,ఆయన్ను మేము గురువుగా భావిస్తామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టి వేధించినా కూడా చెక్కుచెదరని మనోధైర్యంతో తెలుగుదేశం పార్టీ కోసం పోరాటాలు చేశారని, ఈ తరం రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవలసిన వ్యక్తి అయ్యన్నపాత్రుడని రాజేంద్రప్రసాద్ అన్నారు.
ఈ కార్యక్రమంలో విజయ మిల్క్ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య, రాష్ట్ర ఎంపీపీల సంఘం అధ్యక్షులు ఏజర్ల వినోద్ రాజ్, తెదేపా సగర సాధికార రాష్ట్ర కన్వీనర్ జంపన వీర శ్రీనివాస్, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ అజ్మతుల్లా, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాజుల పాటి ఫణి తదితరులు పాల్గొన్నారు.






