
స్వర్ణోదయం ప్రతినిధి మంచిర్యాల జూన్ 22: మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సంగెం లక్ష్మణ్, జిల్లా గౌరవ అధ్యక్షులు కంచర్ల కొమురయ్య అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేసిన ముఖ్యనాయకుల సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర యూత్ గౌరవ అధ్యక్షులు సంగెపు ఎల్లన్న, ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తంగెల్లపల్లి తిరుపతి హాజరై మాట్లాడారు. ఒకే దేశం ఒకే రాజ్యాంగం ఒకే కులవృత్తి ఒకే రిజర్వేషన్ కలిగి ఉండెట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా ఒకే కులవృత్తి చేసే ధోబీలకు భిన్న రిజర్వేషన్లు ఉండటం చేత ఆర్థిక అసమానతలు తలెత్తుతాయని ఆవేధన వ్యక్తం చేశారు. ఎస్సీ జాబితాలో ఉన్న 18 రాష్ట్రాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందుతున్నాయనీ మిగతా 11 రాష్ట్రాలు అందుకు భిన్నంగా ఉండటం చేత కడు బీదరికంలో మగ్గుతున్నారని వాపోయారు. జిల్లా అధ్యక్షులు సంగెం లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి గత అసెంబ్లీలో రజక కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని మాట్లాడిన మాటలను సాకారం చేసేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని అన్నారు. జిల్లా గౌరవ అధ్యక్షులు కంచర్ల కొమురయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లోక్ సభ బిల్లు ఆమోదించి దేశవ్యాప్తంగా ఒకే రిజర్వేషన్ కల్పించి రజక కులస్తులకు న్యాయం చేయాలని కోరారు. ముఖ్యనాయకుల సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు కోలిపాక రమేష్, జిల్లా కార్యదర్శి తాడూరి శంకర్, జిల్లా ప్రచార కార్యదర్శి రాసమల్ల కుమార్, జిల్లా సభ్యులు నస్పూరి అంకన్న ,పట్టణ కార్యదర్శి చంద్రగిరి చంద్రమౌళి ,సభ్యులు పరిపల్లి మల్లయ్య, ముప్పు రాయమల్లు, మొగుల్ల రాజయ్య, ఓరగంటి ఎల్లయ్య, అన్నారం శంకరయ్య, చంద్రగిరి శంకర్, కటుకూరి శ్రీనివాస్, సంగెపు రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
