
స్వర్ణోదయం ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం పట్టణంలో స్థానిక విలేకరి ఇంటిలో తుపాకీ తూటాలు దొరికినట్లుగా తప్పుడు కేసులు పెట్టడం. అధికారాన్ని దుర్వినియగం చేసి పోలీసు గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవరించిన సీఐ శ్రీధర్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ రేంజ్ ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారం తమ చేతుల్లో ఉంది కదా అని దానిని స్వలాభం కోసం అధికారి వాడుకుంటే పరిణామాలు ఇంత సీరియస్ గా ఉంటాయని ఈ సంఘటన రుజువు చేసింది.
