మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ మున్సిపల్ ఆఫీస్ ఆవరణంలో అటెండెన్స్ పాయింట్ వద్ద ఆదివారం మున్సిపల్ కార్మికుల సమస్యల గురించి తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ రాష్ట ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు రూ.26,000 వేల వేతనం, పలు సమస్యలు గురించి మాట్లాడారు. ఈనెల 26 న కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమములో యూనియన్ టౌన్ అద్యక్షులు ఎండీ అంజు, ఉపాధ్యక్షులు రాసపల్లి సరోజన, సమ్మక్క, క్రాంతి కుమార్, మొగిలి, కోశాధికారి రోంటాల రాజేశ్వరి, ప్రచార కార్యదర్శి బొరగల కుమార్, రాజు, సహాయ కార్యదర్శి రాజేష్, సోషల్ మీడియా ఇన్చార్జి చిరంజీవితో పాటు కార్మికులు పాల్గొన్నారు.