
మండల యాదగిరి, స్వర్ణ ఉదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గ కేంద్రంలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు హుజురాబాద్ మండల & పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం దివంగత నేత, బహు భాషా కోవిదుడు, తొలి తెలుగు ప్రధానమంత్రి పీవీ నరసింహరావు 103వ జయంతి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. ముందుగా పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు, అనంతరం స్వీట్లు పంపిణీ చేసి ప్రధానిగా తెలుగు రాష్ట్రాలకు దేశ ప్రజలకు అందించిన సేవలను పలువురు వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొల్లూరి కిరణ్ కుమార్, నియోజకవర్గ మైనారిటీ నాయకుడు యండి అఫ్సర్, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్, సీనియర్ నాయకులు కోలిపాక శంకర్, నేరళ్ళ మహేందర్ గౌడ్, ఖాజీపేట శ్రీనివాస్, సందమల్ల బాబు, యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ అసెంబ్లీ ప్రెసిడెంట్ చల్లూరి రాహుల్, మండల మహిళా కాంగ్రెస్ నాయకురాలు లంకదాసరి లావణ్య, యేముల పుష్పలత, ఆలేటి సుశీల, దుబాసి బాబు, గంట కిరణ్ రెడ్డి, మండ సాయి, కుర్ర శ్రీనివాస్ గౌడ్, ఇప్పలపల్లి చంద్రశేఖర్, ఉప్పుల శ్రీనివాస్ పటేల్, యండి ఇమ్రాన్, కడారి తిరుమల, నర్సింగ్, యండి రియాజ్, కరీమా, గొస్కుల రిబ్కా తదితరులు పాల్గొన్నారు.






