మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకుల అధ్యక్షుడుగా గతంలో నాతో సహకార రంగానికి జోడెద్దుల లాగ రవీందర్ రావు పని చేశాడని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. ది.కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ సర్వసభ్య సమావేశం సహకార సంఘం అధ్యక్షులు కొండూరు రవీందర్ రావు అధ్యక్షతన నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ ని సహకార సంఘం అధ్యక్షులు కొండూరు రవీందర్ రావు, సభ్యులు పూల బొకేలు ఇచ్చి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో సహకార రంగంలో మార్క్ ఫెడ్ చైర్మన్ గా జగతిరావు ఉండేవారనీ, నేను సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కావాలని ఉండే.. కానీ 15 రోజుల్లోనే మార్క్ ఫెడ్ చైర్మన్ అయ్యాను అని గుర్తు చేశారు. తరువాత కరీంనగర్ ఎంపీ అయ్యాననీ, తరువాత హుస్నాబాద్ పోయి ఎమ్మెల్యే అయ్యా, మా పార్టీ అధికారంలోకి వచ్చి మంత్రి అయ్యాను అని చెప్పుకొచ్చారు. నా రాజకీయ జీవితం కరీంనగర్ సిటీ నుండి సహకార రంగంలో ప్రారంభం అయిందనీ, శ్రమ పడి రైతులకు నిజాయితీగా సేవ చేశాను అన్నారు. మా నాన్న రైతు పంట ఉత్పత్తి చేసి అమ్ముకోవడానికి ఇబ్బంది పడేదనీ, వైఎస్ఆర్ మార్క్ ఫెడ్ చైర్మన్ గా అడగగానే వెయ్యి కోట్లు ఇచ్చారన్నారు. మార్క్ ఫెడ్ గా అప్పు తీసుకోవడానికి జీవో ఇచ్చారనీ పేర్కొన్నారు. సహకార రంగాల ద్వారా వరి, మొక్క జొన్న కొనాలని జీవో లు తెచ్చాం.. ప్రోటోకాల్ లో పిలవాలని తెచ్చామని గుర్తు చేశారు. ఎవరు మార్క్ ఫెడ్ కి వచ్చిన గౌరవంగా ఉండేలా సహకార రంగాన్ని తీర్చిద్ధిద్దమాన్నారు. క్రిబ్కో డైరెక్టర్ గా అన్ని రాష్ట్రాలు తిరిగిన అడ్వాన్స్ పైసలు ఇచ్చిన సంస్థ మీదే అన్నారు. సహకార రంగం నుండి వివిధ దేశాల్లో పర్యటించామని, సహకార రంగంలో నలుగురు సహాయం చేసేలా రవీందర్ రావు, నేను పని చేశామని గుర్తు చేశారు. మీకు ఏ సమస్యలు ఉన్న నా దృష్టికి తీసుకురండి..రాజకీయాలు వేరు సహకార సంఘాలు వేరు..క్రీబ్కోలో అన్ని పార్టీల వారు ఉంటారన్నారు. అది రాజకీయాలకు సంబంధం లేకుండా రైతుల సంక్షేమం కోసం పని చేస్తుందన్నారు. రైతు సేవకులుగా ఉండే విధంగా మన జీవితం దన్యమవుతుందన్నారు. సహకార రంగం నుండి వచ్చి మంత్రి అయ్యా.. మీ అందరికీ అందుబాటులో ఉంటా అని హామీ ఇచ్చారు. నాబార్డు అధికారులను కోరుతున్న కేంద్రం నుండి రాష్ట్ర సహకారంతో పాడి పంటలు, రైతులు అభివృద్ధికి కృషి చేయండి అని సూచించారు. సహకారం అంటే రైతులకే కాదు చేనేత కార్మికులకు కూడా సహాయం చేశామన్నారు. ఇప్పుడు కూడా సిరిసిల్ల చేనేత కార్మికులకు అండగా ఉంటామని తెలిపారు.