
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ సహాయ కార్మిక శాఖ అధికారి కార్యాలయంలో హుజురాబాద్ ఆర్టీవో రమేష్ బాబు శుక్రవారం సాయంత్రం విచారణ జరిపారు. గురువారం ‘స్వర్ణోదయం డిజిటల్ పేపర్లో’ “ఏ ఎల్ వో కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తుల హల్చల్ ‘అని వచ్చిన వార్తకు స్పందించి కాంగ్రెస్ నాయకుడు మిడిదొడ్డి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆర్డిఓ రమేష్ బాబు, హుజురాబాద్ తహసిల్దార్ కే విజయ్ కుమార్ ఇద్దరు సహాయ కార్మిక శాఖ అధికారి కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ దివ్యను ఫిర్యాదుదారుడు మిడిదొడ్డి శ్రీనివాస్ ను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలోని సిసి ఫుటేజీలను పరిశీలించారు. ఏ ఎల్ ఓ సెలవు పత్రాన్ని రాసి పెట్టారు కానీ ఉన్నత అధికారులు అధికారికంగా సెలవు ఇవ్వలేదని గుర్తించి ఆమెను ఫోన్లో సంప్రదించగా హైదరాబాదులో కార్మిక శాఖ కమిషనర్ సమావేశానికి హాజరైనట్లు సమాచారం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. సమీపంలోని వ్యక్తులను పలు వివరాలు అడిగి తెలుసుకుని పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్కు శనివారం అందజేస్తామని ఆర్డిఓ రమేష్ బాబు తెలిపారు. అయితే కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు, పలువురు కార్మికులకు ఎదురవుతున్న ఇబ్బందులను ఆ సమయంలో ఉన్న పలువురిని అడిగి తెలుసుకుని ఈ విషయమై కలెక్టర్ కు నివేదించానున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా సహాయ కార్మిక శాఖ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు ఈ విచారణతో నైనా పులిస్టాఫ్ పడాలని పలువురు భావిస్తున్నారు.
