
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ లో ఈ రోజు ఆదివారం తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేష్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంకు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవలే జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఛైర్మెన్ గా ఎన్నికైన పిట్టల రవీందర్ ని బండ ప్రకాష్ తో కలిసి కెడిసిసి బ్యాంకు జిల్లా వైస్ చైర్మన్ పింగళి రమేష్ సన్మానించి హార్థిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్య శాఖ సహకార సంఘాల అన్నింటికీ జిల్లా స్థాయిలో బాధ్యత రావడం అనేది గొప్ప విషయం అన్నారు. జిల్లాలో ఉన్నటువంటి అన్ని మత్స్య సహకార సంఘాల బలుపేతానికి కృషి చేస్తానన్నారు. అవి అభివృద్ధి పథంలో సాగే విధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువత అధ్యక్షులు పండుగ బాలు, ముదిరాజ్ మహాసభ హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు జెకే, జవ్వాజి చిరంజీవి, సురేష్, ప్రశాంత్, చరణ్. బూమేష్ తదితరులు పాల్గొన్నారు.






