
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్యురాలు డాక్టర్ రచనను, నేషనల్ చార్టర్డ్ అకౌంటెంట్ డే సందర్భంగా అకౌంటెండ్ క్యాస చక్రాధర్ దంపతులను సోమవారం వాసవి వనిత క్వీన్ క్లబ్ ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు శైలజ మాట్లాడుతూ…గత కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు వైద్య సేవలందించిన విషయాన్ని గుర్తు చేస్తూ వైద్యుల సేవలను కొనియాడారు. నిస్వార్ధంగా వైద్యులు చేసే సేవలను ప్రజలు ఎప్పుడు మరిచిపోరాన్నారు. నేనషల్ చార్టర్డ్ అకౌంటెంట్ డేను ప్రతి సంవత్సరం జులై 1న జరుపుకుంటారని, ఆర్ధిక, వ్యాపార రంగంలో సిఏ, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆడిటర్ల పాత్ర చాలా ముఖ్యమైందన్నారు. ఎంతో నీతి నిజాయితీగా ఆడిటర్ గా సేవలందిస్తున్న క్యాస చక్రధర్ సేవలు హుజురాబాద్ ప్రాంతానికి ఏనలేనివని, వెలకట్టలేనివని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వాసవి వనిత క్వీన్ క్లబ్ సెక్రటరీ గోలి హిమబిందు, టెజర్రర్ శివనాథుని స్వప్న, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.







