
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రపంచంలో ఉత్తమమైన వృత్తుల్లో వైద్య వృత్తి ఒకటని అలాంటి వైద్యులను సన్మానించడం మనను మనం సన్మానించుకోవడమేనని పలువురు అభిప్రాయపడ్డారు. సోమవారం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు డాక్టర్ సుధాకర్ రావు, డాక్టర్ పి శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ రమణారెడ్డి, డాక్టర్ వాణిలత, డాక్టర్ రామలింగారెడ్డి, డాక్టర్ స్వాతి, డాక్టర్ నవీన్, డాక్టర్ చంద్రమౌళి, డాక్టర్ కృష్ణమూర్తి, డాక్టర్ నాగలింగంలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్చమిచ్చి శాలువాలతో సత్కారం చేశారు. వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఇన్ఛార్జి బ్రహ్మాకుమారి వాణి, గుంటి రాజయ్య, శివరాత్రి ఈశ్వరయ్య, కోటోజు జ్యోతిరాణి తదితరులు పాల్గొన్నారు.
