
స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్: అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ కార్మికుల మూడు నెలలు పెండింగ్ జీతాలు ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలనీ కరీంనగర్ కలెక్టరెట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒక్కతో తేదీన జీతాలు వేస్తున్నామని చెప్తున్నారు కానీ మరి ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేసే కార్మికులు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి అన్యాయం చేసేరో చెప్పాలని అన్నారు. గత మూడు నెలలుగా కార్మికులకు జీతాలు రావడం లేదని అనేక సార్లు వైద్య అధికారులకు, ఏజిల్ సంస్థ యాజమాన్యానికి చెప్పిన పట్టించుకోవడం లేదని విమర్శించారు. తక్షణమే పెండింగ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు రుణమాఫీ ఆగస్టు లోపు చేస్తామని ప్రకటించారో అదే పద్ధతిలో మిగితా హామీలు అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. రైతు భరోసా ఎకరానికి రూ. 15 వేలు ఇస్తామని అన్నారనీ, కౌలు రైతులకు వర్తింప చేస్తామని అన్నారు కానీ కౌలు రైతులకు ఎలా ఇస్తారో విధివిధానాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటకు క్వింటల్ కు రూ. 500 బోనస్ ఇవ్వాలనీ, వ్యవసాయ కూలీలకు రూ. 12వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనీసం 30 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఏడాదిలోగా 2 లక్షలు ఉద్యోగాలిస్తామని, జాబ్ కేలండర్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆరునెలలైనా జాబ్ కేలండర్ ఎందుకివ్వలేదు? ఆ హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. కనీసం 30 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1కు 1:50 కాకుండా 1:100 చొప్పున మెయిన్స్ కు అవకాశం ఇవ్వాలని అన్నారు. గురుకులాల్లో టీచర్లను నియమించాలని డిమాండ్ చేశారు. వృద్ధులకు పెన్షన్ 2 వేల నుండి 4వేలకు పెంచి ఇస్తామని అన్నారు కానీ ఇప్పటి వరకు ఇవ్వక పొగ గత 3నెలలు నుండి పెన్షన్ రాక వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు రూ. 2500 భృతి ఇవ్వాలని అన్నారు. ఉద్యమకారులకు 250 చ. గ. స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా ప్రతి కుటుంబానికి 500ల కె గ్యాస్ సిలెండర్ ఇవ్వాలని అన్నారు. విద్యార్ధులకు రూ. 5 లక్షల విద్యాభరోసా కార్డు ఇవ్వాలనీ,విద్యాజ్యోతి పథకం అమలు చేసి SC,ST విద్యార్థులు 10th పాసైతే 10వేలు ఇస్తామని అన్నారనీ తక్షణమే అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఇల్లు లేని వారికీ 5 లక్షలు ఇవ్వాలనీ, ఇంటి స్థలం లేని వారికీ స్థలం మరియు 5లక్షలు ఇల్లు నిర్మాణానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియాంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లను తక్షణమే విడుదల చేయాలనీ కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చిందనీ, అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు షరతులు పెట్టుతున్నారనీ ఇది సరైంది కాదని భవిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు పెట్టకుండా అన్నిరకాల ఇచ్చిన హామీలను అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. లేదంటే అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనకు పిలుపులు ఇస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కురువెల్లి శంకర్, ప్రశాంత్ కుమార్, బేక్కంటి రమేష్, బద్రి నేత, పార్టీ నాయకులు సూర్యకిరణ్ , రాజశేఖర్ గౌడ్, కార్మిక సంఘ నాయకులు అరుణ్, కళావతి, శారదా సరళ తదితరులు పాల్గొన్నారు.
