
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మ్యాజిక్ బస్ మరియు కెరీర్ గైడెన్స్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత ఉద్యోగ శిక్షణను కళాశాల ప్రిన్సిపాల్ డా. పి ఇందిరాదేవి ప్రారంబించారు.
ఈ నెల 1వ తేదీ నుండి 8వ తేది వరకు వారం రోజులు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచిత శిక్షణ కొనసాగుతుందని కళాశాల కెరీర్ గైడెన్స్ సెల్ కోఆర్డినేటర్ ఎస్ మధు, మ్యాజిక్ బస్ ఆఫీసర్ ఎం శివశంకర్ ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో తెలిపారు. వివిధ సంస్థలలో ఉద్యోగాలకు ఈ ఉచిత శిక్షణ ఇచ్చి తదనంతరం ప్లేస్మెంట్స్ & జాబ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందనీ నిర్వాహకులు తెలిపారు. హుజురాబాద్ చుట్టుపక్కల ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు అందరూ కూడా ఈ కోచింగ్ తీసుకోవడానికి అర్హులనీ, అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులందరూ కూడా హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వారి ఎస్.ఎస్సి, ఇంటర్, డిగ్రీ మెమోలతో పాటు ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, బయోడేటా ఫామ్ తీసుకొని వచ్చి ఉచిత శిక్షణలో పాల్గొనాలన్నారు. పూర్తి వివరాలకు మ్యాజిక్ బస్ ఆఫీసర్ శివ శంకర్,ఫోన్ నెంబరు 7893186719 లో సంప్రదించాలని, ఇలాంటి సువర్ణ అవకాశాన్ని యువత తక్షణమే ఉపయోగించుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. ఇందిరాదేవి కోరారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సపాల్ పి ఎల్ ఎన్ మూర్తి, కళాశాల ఐ క్యూ ఏసీ కోఆర్డినేటర్ డా. పి. దినకర్, అకాడమిక్ కో ఆర్డినేటర్ డా. జి.శ్రీనివాస్, ఉపన్యాసకులు గొడిశాల పరమేశ్, రాజకుమార్, హరిప్రసాద్, సమ్మయ్య, శ్యామలాదేవి, చారి, స్వప్న, స్వరూప, బోధనేతర సిబ్బంది మరియు శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు పాల్గొన్నారు.
