
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలో ఉచితంగా ల్యాప్ టాప్ లను పంపిణీ చేయనున్నట్లు తెలిసింది. విద్యార్థులకు ఇంటరాక్టివ్ వైట్ బోర్డులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు పాఠశాల విద్యార్థులకు 20వేల ల్యాప్‌టాప్‌లు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీనిపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, నోకియా సంస్థ ప్రతినిధులతో సీఎం చర్చించారు. ల్యాప్‌టాప్‌లు ఏ క్లాస్ నుంచి అందించాలనే అంశాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు. ఏది ఏమైనా తమిళనాడు తరహాలో తెలంగాణలోని విద్యార్థులకు కూడా ఉచితంగా ల్యాప్ టాప్ లు పంపిణీ చేయనుండడం శుభపరిణామమే అయినా వాటి వినియోగం పై నిఘా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.






