
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ,అవకతవకలపై ఈ నెల 4వ తేదీన భారత్ బంద్ కు ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయని అన్ని వర్గాల ప్రజలు సహకరించి విజయవంతనికి కృషి చేయాలని ఎన్ఎస్యుఐ నాయకులు బుధవారం పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ అధ్వర్యంలో బంద్ ని సక్సెస్ చేయాలనీ(NSUI -SFI – AISF – PDSU -VJS-AIPSU- PYC- DYFI-AIYF-PYL-YJS) కోరారు. ఇందులో భాగంగా NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆదేశాల మేరకు రేపు 4న రోజున బంద్ కి పిలుపునివ్వడం జరిగిందనీ NSUI జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ఇమ్రాన్ మరియు కార్యదర్శి పల్నాటి అభిలాష్ తెలిపారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, NTA సంస్థ నిర్వహణ లోపం పేపర్ అమ్ముకోవడంపై కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు చాలా బాధాకరమన్నారు. నీట్ పరీక్ష రాసిన 24లక్ష మంది విద్యార్థులకు న్యాయం చేయడంతో పాటు రానున్న రోజులో ఇలాంటి తప్పిదాలు జరుగకుండా చేయాలన్నారు. నీట్ పరీక్షను రద్దు చేసి మళ్ళి నిర్వహించాలని, అలాగే NTA నీ రద్దు చేసి విద్యార్థుల నమ్మకాని కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయన్నారు. ఎందుకంటే జూన్ 14న విడుదల కావాల్సిన నీట్ రిజల్ట్స్ జూన్ 4వ తేదీ విడుదల చేశారన్నారు. అంటే 10 రోజుల ముందే అంది కూడా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల రోజు ఎన్నికల ఫలితాల రోజైతే ఎవరు గ్రహించరని అనుకున్నారన్నారు. కానీ అంత కంటే ముందే పేపర్ లికేజీ అనుమానం, విద్యార్థుల మార్క్స్ చూశాక మరింతగా మారిందన్నారు. దీంతో పేపర్ లీకేజీ అయిందని రుజువైందన్నారు. స్వయంగా పేపర్ లీకేజీ పై ఎంక్వయిరీ చేస్తామని చెప్పారు అంటే పేపర్ లీకేజీ అయినట్లే కాద మరి ఎందుకు రద్దు చేయడం లేదనీ పేర్కొన్నారు. ఇప్పుడు ఇదొక్కటే కాదు రానున్న యూపీఎస్సీ పరీక్షల పై కూడా విద్యార్థులకు, తల్లితండ్రులకు అనుమానాలు వస్తాయన్నారు. నమ్మకం కలిగించాలంటే తప్పకుండా నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లి నిర్వహించాలనీ డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష నిర్వహించిన ఏజెన్సీ NTA నీ రద్దు చేయాలనీ, అలా చేసే అంత వరకు అందరం కలిసి పోరాటం చేస్తామన్నారు.
నాయ్యం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందనీ
దానికిగాను ఎన్ని పోరాటాలు చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నామన్నారు. రేపు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా స్కూల్స్, కళాశాలలు, స్వచ్ఛందంగా యాజమాన్యాలు సహకరించి బంద్ ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో NSUI కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ఇమ్రాన్, NSUI కరీంనగర్ జిల్లా కార్యదర్శి పల్నాటి అభిలాష్ తో పాటు నాయకులు సోహేల్, శివ, నాగరాజు, వంశి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.






