
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండల పరిధిలోని శాలపల్లి -ఇందిరానగర్ లో ఉన్న tgswrs హాస్టల్ నీ ఎన్ఎస్ యుఐ నాయకులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా నాయకులు ప్రిన్సిపాల్ ను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సంబంధించిన బట్టలు, పుస్తకాలు, స్టడీ హవర్ గురించి, మెను ప్రకారం ఆహారం పెట్టుతూన్నారా లేరా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇస్తున్న అన్ని సౌకర్యాలు పిల్లలకు అదెలా చెయ్యాలని ప్రిన్సిపాల్ నేతలు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ యుఐ హుజురాబాద్ మండల అధ్యక్షులు పంజాల అరవింద్, నాయకులు శనిగరం తరుణ్ కుమార్, నాగరాజు, సంపత్, రామ్మోహన్, వేణు, సాయి తదితరులు పాల్గొన్నారు.






