
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు అధ్యక్షతన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి పురస్కరించుకొని 34వ బూత్ లో అమ్మకు గుర్తుగా ఒక మొక్క నాటి డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు, పైళ్ల వెంకటరెడ్డి, నల్ల సుమన్, ప్రధాన కార్యదర్శి తూర్పాటి రాజు, పట్టణ ఉపాధ్యక్షులు యాళ్ల సంజీవరెడ్డి, తిప్పబత్తినీ రాజు, BJYM అద్యక్షులు పంజాల మనోజ్, శక్తి కేంద్ర ఇన్చార్జి కొలిపాక వెంకటేష్, బూత్ అధ్యక్షులు ఆవుల సదయ్య, నల్ల అజయ్, బొల్లోజు వినయ్, రాపాక రాజు, తాళ్లపళ్లి దేవేంద్ర, తుర్పాటి సాగర్, సీనియర్ నాయకులు, బచ్చు కనకరత్నం తదితరులు పాల్గొన్నారు.







