మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి హుజురాబాద్:
భారత మాజీ ఉప ప్రధాని, సీనియర్ పార్లమెంటేరియన్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 38వ వర్ధంతి కార్యక్రమం హుజురాబాద్ లోని బాబు జగ్జీవన్ రామ్ జయంతోత్సవ కమిటీ చైర్మన్ రొంటాల సుమన్ ఆధ్వర్యంలో కరీంనగర్ రోడ్ లో జగజీవన్ రామ్ చౌరస్తా దగ్గర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా హుజురాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ గందే రాధిక శ్రీనివాస్ మరియు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ విచ్చేసి బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ భారత ఉప ప్రధానిగా, వ్యవసాయ మరియు రక్షణ శాఖ మంత్రిగా వివిధ పదవులను సమర్ధవంతంగా నిర్వహించాడన్నారు. భారతదేశం పైన విదేశీ శక్తులు దండెత్తినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కొని వారిని ఓడించి భారత దేశానికి విజయాన్ని సాధించారని గుర్తు చేశారు. వ్యవసాయ శాఖ మంత్రిగా హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టి అధిక దిగుబడిని అందించే విత్తనాలను ప్రవేశపెట్టి అధిక జనాభా గల భారతదేశంలో ఆహార కొరతను తీర్చారు. అదే విధంగా అణగారిన వర్గాల అభివృద్ధి కోసం పార్లమెంట్ లో చట్టాలను రూపొందించి వాటిని అమలు చేయుటలో క్రియాశీలక పాత్రను నిర్వహించారని ఆయన సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు . ఈ కార్యక్రమంలో దళిత, బహుజన ప్రజా సంఘాల నాయకులు వేల్పుల రత్నం, జ్యోతిరావు పూలే జయంతి కమిటీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్, అంబేద్కర్ జయంతి కమిటీ చైర్మన్ మహమ్మద్ ఖాలీక్ హుస్సేన్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్, ఎర్ర శ్రీధర్, డాక్టర్ తడికమళ్ళ శేఖర్, తునికి సమ్మయ్య, చందుపట్ల జనార్ధన్, ఇల్లందుల సమ్మయ్య, వేల్పుల ప్రభాకర్, బోరగాల సారయ్య, కలవల మల్లయ్య అంబాల రవీందర్, ఎర్ర కుమార్, రామ్ రాజేశ్వర్, వేల్పుల భాస్కర్, అరికిళ్ల ఐలయ్య, గాజుల సంపత్, వేల్పుల భాస్కర్, కొంకటి స్వామి తదితరులు పాల్గొన్నారు.