
మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి, హుజురాబాద్: వాషింగ్టన్ డిజిటల్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందిన నాగార్జున డైరీ ఎండి పుల్లూరి ప్రభాకర్ రావును ఆదివారం హుజురాబాద్ నాగార్జున డైరీలోని ఉద్యోగులు, సిబ్బంది ఘనంగా ఆయనకు స్వాగతం పలికి, పూల బొకే ఇచ్చి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా డైరీ రంగంలో పనిచేస్తూ వందలాది మంది ఉద్యోగులకు పని కల్పిస్తూ నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నందుకు వాషింగ్టన్ డిజిటల్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ ప్రధానం చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరీ సీఈవో కృష్ణ ప్రసాద్, ఏజీఎంలు ఆకునూరి సుధాకర్, వెంకటస్వామి, మేనేజర్లు సంతోష్ కుమార్ , రజినీకాంత్ రెడ్డి, డైరీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.








