
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు. ఆదివారం విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ లాగిన్లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. తుది కీతో పాటు రిజల్ట్స్‌ను టీజీపీఎస్సీ ఒకేసారి విడుదల చేసింది. గ్రూప్-1 మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అక్ట్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.






