
స్వర్ణోదయం ప్రతినిధి, కమాన్ పూర్: జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని టియూడబ్ల్యూజే (ఐజేయూ) జాతీయ కార్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్ అన్నారు. ఆదివారం కమాన్ పూర్ మండల కేంద్రంలో పెద్దపల్లి జిల్లా టియూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు బుర్ర సంపత్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగునూరి శేఖర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధనలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని అన్నారు. వివిధ వర్గాల సమస్యలు పరిష్కారం అయినప్పటికీ, జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాకపోవడం బాధాకరమని అన్నారు. 10 ఏళ్ల తర్వాత జర్నలిస్టుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇల్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం అనుకూలంగా ఉన్నట్లు కనబడుతుందని అన్నారు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ 200 గజాల ఇండ్ల స్థలాలతో పాటు, ప్రత్యేక కోటా కింద ఇండ్లు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ పలు తీర్మాణాలను చేసింది. జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ 200 గజాల ఇళ్లస్థలతో పాటు, ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని తీర్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లుగానే, జర్నలిస్టులందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే జర్నలిస్టులు పనిచేసే వృత్తి ప్రమాదకరమైందని, ఈ నేపథ్యంలో జర్నలిస్టులందరికీ రైతు బీమా వలే 10 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి హెల్త్ కార్డులకు భిన్నంగా, ప్రత్యేకంగా జర్నలిస్టులందరికీ 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంలో అవసరమైతే జర్నలిస్టుల పరంగా చెల్లించే ప్రీమియంలో తాము భాగస్వాములు అవుతామని చెప్పారు. జిల్లా అధ్యక్షులు బుర్ర సంపత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని, ఎవరు కూడా ఆందోళన చెందవద్దని సూచించారు. ప్రభుత్వ పరంగా మనకు రావాల్సిన హక్కులను సాధించి తీరుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు వంశీ దయానంద్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కోల లక్ష్మణ్, గాండ్ల శ్రీనివాస్, దాడుల నివారణ కమిటీ చైర్మన్ సిపెళ్లి రాజేశం, జిల్లా ఉపాధ్యక్షులు నారాయణదాసు అశోక్, పాలకుర్తి విజయ్ కుమార్, పోతరాజు సమ్మయ్య, పొన్నం శ్రీనివాస్, కోశాధికారి పెండ్యాల రామ్ కుమార్, జిల్లా ఆర్గనైజింగ్, సంయుక్త కార్యదర్శి బాలసాని రాజయ్య, కె ఎస్ వాసు, జక్కని సత్యనారాయణ, సురభి శ్రీధర్, కె చంద్రమోహన్, జిల్లా కార్యవర్గ సభ్యులు గాదె బాలయ్య, బాల శివప్రసాద్, గిరవేణ రాకేష్, జ్యోతుల ప్రవీణ్, మహేందర్ రెడ్డి, జల్లి శంకర్, కే ఎల్ మూర్తి యాదవ్, ఆరెల్లి మల్లేష్, ఆకుల రమేష్, దబ్బేట శంకర్, గడ్డం రవీందర్, శ్యామ్, పెద్దపల్లి, మంథని, ధర్మారం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చింతకింది చంద్రమౌళి, అంకరి కుమార్, తిరుపతిరెడ్డి, కమాన్ పూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
*కమాన్ పూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా సాయి శంకర్*
కమాన్ పూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా సాయి శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం కమాన్పూర్ లో జరిగిన టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమాన్పూర్ మండల ప్రెస్ క్లబ్ నియామకాన్ని చేపట్టారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా బండ సాయి శంకర్, ప్రధాన కార్యదర్శిగా మల్యాల సురేష్ గౌడ్, కోశాధికారిగా గాదె బాలయ్య, కార్యవర్గ సభ్యులుగా ఎండి జబ్బార్ ఖాన్, దండే కృష్ణ, ఆరేపల్లి శంకర్, పొన్నం నవీన్ కుమార్ ఎన్నికయ్యారు.

