
స్వర్ణోదయం ప్రతినిధి, సైదాపూర్ జులై 8: సైదాపూర్ మండలంలోని బొమ్మకల్లు గ్రామంలో గల (జెడ్పిహెచ్ ఎస్) జిల్లా పరిషత్ హై స్కూల్లో 1996 -97 సంవత్సరములో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. విద్యార్థి దశలో ఆడి పాడిన జ్ఞాపకాలను ఒకరినొకరు నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఎంఈఓ ప్రధాన ఉపాధ్యాయుడు ఏలూరి నర్సిరెడ్డితోపాటు ఉపాధ్యాయులు బండి రాజయ్య, బత్తిని రాజయ్య, సీతారామయ్యశర్మ, గుంటి విష్ణుమూర్తి, అనుముల వేణుగోపాల్ శర్మ, లింగ బత్తిని మల్లేశంతో పాటు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.






