
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామంలో సోమవారం ఇటీవల మరణించిన మరియు అనారోగ్యానికి గురైన నిరుపేద పద్మశాలి కుటుంబాలకు చేయూతనిప్పించడానికి టిఆర్పిఎస్ జిల్లా కో కన్వీనర్ చిలుకమారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరియు హుజురాబాద్ టిఆర్పిఎస్ మండల కన్వీనర్ సంగేమ్ సత్యనారాయణ, రాష్ట్ర టిఆర్పిఎస్ నాయకులు బూర మల్లేశంను సంప్రదించారు. వీరి విజ్ఞప్తి మేరకు రాష్ట్ర నాయకులు బూర మల్లేశం కాట్రపల్లి గ్రామాన్ని సందర్శించి నిరుపేదలైన, ఎలాంటి జీవనాధారం లేని మూడు పద్మశాలి కుటుంబాలను గుర్తించి వారికి కోమటి రంజిత్ తల్లి అయినటువంటి కోమటి రాజేశ్వరికి ఐదు వేల రూపాయలు, పక్షవాతానికి గురై మంచం నుండి లేవలేని స్థితిలో ఉన్న కోమటి కనకమ్మకు ఐదు వేల రూపాయలు, చాలా రోజులుగా పక్షవాతానికి గురైన సబ్బని లక్ష్మీకి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు బూర మల్లేశం మాట్లాడుతూ త్వరలోనే టీఆర్పిఎస్ కు ఎన్నికలు జరుగుతాయని, పద్మశాలి కులస్తులందరినీ ఒకే సంఘం కిందకు తీసుకువచ్చి టీఆర్పీఎస్ ను బలోపేతం చేస్తామని తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఒకే సంఘం ఏర్పడితే ఆ సంఘం ద్వారా మన పద్మశాలి కులస్తులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వంల ద్వారా అందవలసిన నిధులు సంక్షేమ పథకాలు అందేలా టీఆర్పిఎస్ కృషి చేస్తుందని తెలిపారు. ఇకముందు పద్మశాలి కుటుంబాలకు నా వంతుగా నాకు చేతనైన సహాయం చేస్తానని, ఎవరు అధైర్య పడవద్దని, పద్మశాలి కులస్తుల సంక్షేమం కోసం నిరంతరం పాటు పడతానని మల్లేశం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం టీఆర్పీస్ కన్వీనర్ ఆడిచర్ల శ్రీనివాస్, జిల్లా కో కన్వీనర్ చిలుకమారి శ్రీనివాస్, హుజురాబాద్ మండల పద్మశాలి సంఘం టీఆర్పిఎస్ అధ్యక్షులు సంగెం సత్యనారాయణ, టౌన్ కన్వీనర్ ఇప్పలపల్లి చంద్రశేఖర్, జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కని సంజయ్ కుమార్, వీణవంక పద్మశాలి సంఘం అధ్యక్షులు వడ్డేపల్లి రాజగోపాల్, హుజురాబాద్ మండల బీసీ నాయకులు పద్మశాలి కుల బంధువులు కూరపాటి రామచంద్రం, కోమటి శ్రీనివాస్, సబ్బని రమేష్, అల్లి సత్యరాజ్యం, సబ్బని రామస్వామి, సబ్బని కుమారస్వామి, చిలుకమారి రాజమౌళి, భాషబత్తిని విశ్వనాథం, తదితర కుల బాంధవులు పాల్గొన్నారు.







