
స్వర్ణోదయం ప్రతినిధి, మంచిర్యాల: మాజీ మావోయిస్టు నేత మహమ్మద్ హుస్సేన్ అరెస్టు విషయంలో పోలీసుల తీరు పొంతన లేకుండా ఉంది. ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బలవంతంగా టాటా సుమోలో ఎక్కించుకొని కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యుల మీడియా సాక్షిగా తెలుపగా పోలీసులు మాత్రం మావోయిస్టు సానుభూతిపరులను తయారు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్టు చేసామని మంచిర్యాల పోలీసులు వెల్లడించడం హుజురాబాద్ ప్రాంత ప్రజలను అయోమయానికి గురిచేస్తుంది. రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో గత రెండు నెలల నుండి మావోయిస్టు బావాజలన్ని ప్రజలలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశం మరియు సి కా స పునర్నిర్మాణం కొరకు మావోయిస్టుపార్టీ సానుభూతి పరులు కోల్ బెల్ట్ ఏరియాలో కరపత్రాలు విడుదల చేస్తున్నారని, దీనిపై పూర్తిస్థాయి విచారణ కొరకు రామగుండం పోలీస్ కమిషనర్ ఏం శ్రీనివాస్ ఐపిఎస్, (ఐజి) ఆదేశాల మేరకు ఎగ్గడి బాస్కర్ డిసిపి మంచిర్యాల ఆద్వర్యంలో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో ఈ రోజు కొందరు వ్యక్తులు సి కా స పునర్నిర్మాణం కోసం మందమర్రి, రామకృష్ణాపూర్ ఏరియాలలో తిరుగుతున్నారన్న సమాచారం మేరకు బెల్లంపల్లి ఏసిపి ఏ. రవికుమార్ , మందమర్రి సిఐ కే శశిధర్ రెడ్డి, రామకృష్ణాపూర్ ఎస్సై జి రాజశేఖర్ లు సిబ్బందితో రామకృష్ణాపూర్ మరియు మందమర్రి ప్రాంతంలో పెట్రోలింగ్ చేయమనీ ఆదేశించగా సీఐ మందమర్రి, SI RKP లు R.K -1 మైన్ రోడ్డు ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి నల్లటి బ్యాగు భుజానికి వేసుకొని కనిపించగా అతనిని చూసి ఆపడానికి ప్రయత్నించామన్నారు. అతడు అక్కడినుండి పారిపోతుండగా అతనిని ఆపి పట్టుకొని అతని వద్ద బ్యాగును చెక్ చేయగా ఆ బ్యాగులో మావోయిస్టుపార్టీ డాక్యుమెంట్స్, మావోయిస్టు వాల్ పోస్టర్స్, కరపత్రాలు బ్యాగులో ఉన్నాయని, వెంటనే మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి బెల్లంపల్లి ఏసీపి కి సమాచారం ఇచ్చారన్నారు. దీంతో బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ వచ్చి అతన్ని విచారించగా తన పేరు మహ్మద్ హుస్సేన్ @ సుధాకర్ @ రమాకాంత్ మావోయిస్టును అని , నేను జమ్మికుంట నివాసినని చెప్పాడన్నారు. వెంటనే పంచనామ నిర్వహించి అతని బ్యాగులో ఉన్నా మావోయిస్టుపార్టీ డాక్యుమెంట్స్, మావోయిస్టు వాల్ పోస్టర్స్, కరపత్రాలు మరియు సెల్ ఫోన్ అతని వద్ద నుండి సీజ్ చేసి, అతన్ని కస్టడీకి తీసుకోవడం జరిగిందన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుని గత నేరా నేపథ్యం….
మహ్మద్ హుస్సేన్ @ సుధాకర్ @ రమాకాంత్ జమ్మికుంట నివాసస్థుడు 1978 నుండి 1981 వరకు KK-2 మైన్ జనరల్ మాజ్దూర్ గా పనిచేసి మావోయిస్టు భావజాలాలకి ఆకర్షితుడై సింగరేణి ఉద్యోగానికి రాజీనామా చేసి మావోయిస్టు పార్టీలో చేరి వివిధ హోదాలలో పనిచేస్తూ ఉత్తర తెలంగాణ కమిటీ మెంబర్గా ఎదిగినాడు. ఇతను సికాస వ్యవస్థాపక సభ్యుడిగా సి. కా స సిఓ గా పనిచేసినాడు. ఆ కాలంలో ఇతనిపై వివిధ పోలీస్ స్టేషన్లో సుమారు 28 క్రిమినల్ కేసులు నమోదయి గతంలో పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినాడు. చివరిసారిగా 2009లో ఝార్ఖండ్ రాష్ట్రంలో బొకారో జిల్లాలో అరెస్టై 2013 వరకు జైలు జీవితం గడిపి బయటకు వచ్చినాడు. ఇతనికి మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ చంద్రన్న మరియు బండి ప్రకాష్ @ ప్రబాత్ లు డబ్బులు పంపించి కోల్బెల్ట్ ఏరియాలో సికాస పునర్నిర్మాణానికి కృషి చేయవలసిందిగా ఆదేశించినారు. అందులో భాగంగానే 2020 సంవత్సరం నవంబర్ లో క్యాతనపల్లి గ్రామానికి చెందిన గురజాల రవీందర్ ఇంటిలో సి సి మెంబర్స్ వారణాసి సుబ్రహ్మణ్యం మరియు వారణాసి విజయలక్ష్మి మరికొంత మంది తో సమావేశమై ,అట్టి సమావేశంలోని తీర్మణాలకు అనుగుణంగా మహ్మద్ హుస్సేన్ కోల్ బెల్ట్ ఏరియాలో సి కా స పునర్నిర్మాణానికి ప్రయత్తం చేస్తున్నాడనారు. Cr No:55 /2021 U/Sec 120.120(b)r/w 34 IPC Sec 10.13.18.18(b ) UAP Act PS రామకృష్ణాపూర్ లో నిందితుడుగా ఉన్నాడన్నారు.
అరెస్ట్ అయిన మావోయిస్టు వివరములు
మహమ్మద్ హుస్సేన్ s/o అంకుష్, వయస్సు 73, కులం:దూదేకుల, వృత్తి : సికాస C.O, కోల్బెల్ట్ ఏరియా, మందమర్రి, ప్రస్తుతం తను జమ్మికుంట ఏరియాలో పద్మశాలి వాడ అని తెలిపారు.
అయితే ఇంట్లో నిద్రిస్తున్న మహమ్మద్ హుస్సేన్ ను తెల్లవారుజామున పోలీసులు టాటా సుమోలో వచ్చి కుటుంబ సభ్యుల కళ్లెదుటే బెదిరించి కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు తెలుపగా.. పోలీసులు మాత్రం మావోయిస్టు కార్యకలాపాలకు పాల్పడుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని ప్రకటించడం జమ్మికుంట, హుజురాబాద్ ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది. అతనిని అరెస్టు చేసిన వెంటనే పౌరహక్కుల సంఘం నాయకులు, విప్లవ కవి రాచయితల సంఘాల నాయకులు, మీడియా వెంటనే అరెస్టు చూపించాలని డిమాండ్ చేయడంతో గత్యంతరం లేకనే పోలీసులు హుస్సేన్ ని ఆరెస్ట్ చేసి చూపించారని, లేకపోతే ఎలాంటి చెడు వార్త వినాల్సి వచ్చేదోనని ఇక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనపటికీ పోలీసులు మాత్రం ప్రజాసంఘాల, పౌరహక్కుల ఒత్తిడి మేరకే అరెస్టు చూపించి ఉంటారని అంచనాకు వచ్చారు.








