
-భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్
స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్: సాధారణ జీవితం గడపుతున్న మహ్మద్ హుస్సేన్ అక్రమ అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తున్నామని, అక్రమ అరెస్టులను ఖండించండి… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి అంటూ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత రెండు నెలల నుండి సికాస పునర్నిర్మాణం కోసం మందమర్రి, రాంమకృష్ణపూర్ ఏరియలో మావోయిస్టు భావజాలాన్ని తీసుకెళ్తున్నారని, కరపత్రాలు పంచుతున్నారనే పేరుతో మంచిర్యాల పోలీసులు, కాంగ్రేస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మావోయిస్టు పార్టీలో పని చేస్తూ అరెస్టు అయి పది సంవత్సరాల కిందట జైలు నుండి విడుదలై సాధారణ జీవితం గడుపుతున్న 73 సంవత్సరాల వయస్సున్న మహ్మద్ హుస్సేన్ ను కిడ్నాప్ చేసి ఈ తరువాత అరెస్టుగా చూపుతున్నారని పేర్కొన్నారు. ఆర్కే-1మైన్ రోడ్డు ప్రాంతంలో రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాలతో మందమర్రి సీఐ, ఎస్ఐ పెట్రోలింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి నల్లటి బ్యాగు భూజానికి వేసుకుని వెళ్తు కనిసించగా అతనిని ఆపే ప్రయత్నం చేయగా అతడు అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేశాడు. దానితో పారిపోతున్న వాన్ని పట్టుకుని చెక్ చేయగా బ్యాగులో డ్యాక్ మెంట్స్, కరపత్రాలు, వాల్ పోస్టర్లు దొరికినట్లుగా అతనిని విచారించగా నేను మావోస్టునని చెపుకున్నట్లుగా ఒక కట్టు కథను సృష్టించారన్నారు. 73 సంవత్సరాల వృద్ధుడు పారిపోతుండడం, పది సంవత్సరాలుగా జమ్మికుంటలో సాధారణ జీవితం గడుపుతున్న మహ్మద్ హుస్సేన్ నేను మావోయిస్టుగా చెప్పుకోవడం అనేది ఏ ప్రజలు కూడా నమ్మని అబద్దాలతో కట్టు కథలుగా అల్లడమేనని, కేవలం ఫాసిస్టు పాలకులకు మాత్రమే సాధ్యం అవుతుందని ఆరోపించారు.
జవవరి నెలలో స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్ళిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశీయ, విదేశీ కార్పోరేట్లతో ఎన్నడు లేని విధంగా రూ.37,870 కోట్ల పెట్టుబడులను ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో ఒక అదాని గ్రూపు వాటానే రూ.12,400కోట్ల పెట్టుబడి వుంది. విద్యుత్, డేటా సెంటర్, ఏరోస్పేస్, డిఫెన్స్, సిమెంట్, గ్రీన్ ఎనర్జీ తదితర రంగాలలో అదాని గ్రూపు పెట్టుబడులు పెడుతుంది. అందులో భాగంగానే దక్షిణ తెలంగాణ విద్యుత్ సంస్థ (TGSPDL) పలు సర్కిళ్ళను ప్రవేట్ సంస్థలకు అప్పగించే ఒప్పందం కుదుర్చుకున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే పాత బస్తీలో విద్యుత్ బకాయిల వసూళ్ళను ఆదాని సంస్థకు అప్పగించారని. విద్యుత్ భూగర్భ లైన్లు వేసే పని కూడా ఆదానికి అప్పగించారన్నారు. కార్పోరేట్లతో ఒప్పందాలు కుదుర్చుకున్న తరువాత ప్రజా వ్యతిరేక విధానాలు అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. అందులో భాగంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్గత ఒప్పందం చేసుకుని సింగరేణి బ్లాక్ ల అమ్మకానికి సిద్ధమయ్యారని, దీనితో కార్మికులు సింగరేణి బ్లాక్ ల ప్రవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టారని గుర్తు చేశారు. ఈ ఉద్యమాలను అణిచివేయడానికే నాయకత్వం వహిస్తున్న వారిపై మావోయిస్టుల ముద్ర వేసి అరెస్టులకు పూనుకుంటున్నారన్నారు. రాష్ట్రాన్ని సామ్రాజ్య వాదులకు, బడా కార్పోరేట్లకు తాకట్టు పెట్టడానికే వారితో ఒప్పందాలు కుదుర్చుకున్న రేవంత్ రెడ్డి సింగరేణి బొగ్గు బ్లాక్ లను ప్రవేటికరించడానికే ఉద్యమకారులను అరెస్టులు చేస్తున్నారన్నారు. ప్రభుత్వాలను ప్రశ్నించే వారిపై దాడులుకు పూనుకుంటన్నారు. డిఎస్సీ ఉద్యోగాల కోసం పరీక్షలకు ఫ్రీపేర్ కాడానికి ఒక నెల పోస్టుపోన్ చేయమని ప్రభుత్వాన్ని కోరిన విద్యార్థులను అరెస్టు చేసి కేసులు పెట్టారన్నారు. దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ పేరుతో జరుపుతున్న మారణహోమాన్ని చూసి చలించిపోయి, ఈ నరమేధాన్ని ఆపమని, ఈ జల్, జంగల్, జమీన్ మాది అని స్పూర్తిని కలిపించే నాటకంలో ఐదు సంవత్సరాల వయస్సున్న పిల్లలు మానవత్వంతో ఆపరేషన్ కగార్ ఆపండని ప్లేకార్డులను ప్రదర్శిస్తూ తిరుగుతున్న దృష్యాలను ఎస్బి పోలీసులు దొంగచాటున విడియోలు చిత్రికరించి చిన్న పిల్లలను కూడా వదలకుండా ఆ చిన్నారులను, వారి తల్లి దండ్రులను కిడ్నాప్ చేసి బెదిరింపులకు గురి చేసి వదిలేశారన్నారు. ఆ చిన్నారులకున్న మానవత్వం మన పాలకులకు లేదన్నారు. సామ్రజ్యవాదుల, బడా పెట్టుబడిదారుల ప్రయోజనాల కొమ్ముకాస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పాసిజాన్ని అమలు చేస్తున్నారని, రాష్ట్రప్రభుత్వం, కేంద్రంతో చేతులు కలిపి ఉద్యమకారులను, విప్లవకారులను అణిచివేయడానికి ఆపరేషన్ కగార్ ను తీవ్రతరం చేస్తున్నారన్నారు. మావోయిస్టులను నిర్మూలించడానికి అదనపు సాయుధ బలగాలు, నిధులు కావాలని, ప్రత్యేక టాస్క్ ఫోర్సు క్యాంపులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయి గ్రామంలో, ములుగు జిల్లా, వెంకటాపురం మండలం అలుబాక గ్రామంలో ఏర్పాటు చేయాలని, వామ పక్ష తీవ్రవాద జిల్లాలుగా గతంలో వుండి తొలిగించిన మూడు జిల్లాలను సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్స్ పెండెచర్ (ఎస్ఆర్) స్టేటస్ ను తిరిగి కొనసాగించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్య మంత్రి కోరారన్నారు. ప్రజలారా కొద్ది మంది దోపిడి వర్గాల ప్రయోజనాల కోసం పౌర సమాజంపై, ప్రజల ప్రజాస్వామిక హక్కులపై జరుగుతున్న పాశవిక దాడులను బుద్ధిజీవులు, ప్రజాస్వామిక వాదులు, పౌర హక్కుల సంఘాలు, ప్రజాహితం కోరుతున్న వారందరు అక్రమ అరెస్టులను ఖండించండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి..అని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ ఆ ప్రకటనలో పిలుపునిచ్చారు.
,







