సీఐటీయూ ఆధ్వర్యంలో కనీస వేతనం రూ.26వేలు, లేబర్ కోడ్ రద్దు కోసం తాసిల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సీఐటీయూ ఆధ్వర్యంలో కనీస వేతనం రూ.26వేలు, లేబర్ కోడ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హుజురాబాద్ తాసిల్దార్ కార్యాలయము ఎదుట ధర్నా నిర్వహించారు. బుధవారం దేశవ్యాప్తంగా సీఐటీయూ డిమాండ్స్ డే సందర్భంగా హుజురాబాద్ తాసిల్దార్ ఆఫీస్ ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు కదిరే రమేష్ తెలిపారు. ధర్నా అనంతరం తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కదిరే రమేష్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రైవేటీకరణ విధానాలను వేగంగా అమలు చేస్తున్నదన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేస్తామని బిజెపి ప్రభుత్వం ప్రకటించిందని, బొగ్గు బ్లాక్ లో వేలానికి పూనుకున్నదన్నారు. ఈపీఎఫ్ సకాలంలో చెల్లించని యాజమాన్యాలకు విధించే జరిమానాలను భారీగా తగ్గించిందని, కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను విరమించుకోవాలన్నారు. గతంలో పార్లమెంటులో ఆమోదించుకున్న నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని, బొగ్గు బ్లాక్ ల వేలం రద్దు చేయాలని, ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, కనీస వేతనం రూ.26000 నిర్ణయించాలని, స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలన్నారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వారిని పర్మినెంట్ చేయాలని, ఆ లోపు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే డిమాండ్స్ తో పాటు మరికొన్ని డిమాండ్స్ పై ఈ రోజు దేశవ్యాప్తంగా డిమాండ్స్ డే కార్యక్రమం నిర్వహించామన్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమ యజమానుల ఒత్తిడికి తలొగ్గి 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్స్ లో పనిచేస్తున్న కార్మికులకు కొత్త జీవోలను విడుదల చేసింది కానీ ఆ జీవులలో ఒక్క పైసా కూడా వేతనం పెంచలేదు. మోడీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఆశ వర్కర్లకు నష్టదాయకమని బిజెపి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పరీక్షలు పెట్టకుండా నిరాకరించాయి. మన రాష్ట్రంలో మాత్రం గత 15 నుండి 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆశాలకు, వయోపరిమితి దాటిన అంగన్వాడీ టీచర్లను ఆయాలను మాత్రం పరీక్షలు నిర్వహిస్తామని నిర్ణయించడం అన్యాయం.బెనిఫిట్స్ ఇచ్చి ఇంటికి పంపుతున్నారు.ఐటీ పరిశ్రమలకు నాలుగు సంవత్సరాలుగా కార్మిక చట్టాల నుండి మినహాహింపు. రాష్ట్రంలో కూడా నాలుగు లేబర్ కోర్టులను అమలు చేస్తామని, పత్రికలకు లీకలు ఇస్తున్నది ఇది కార్మిక వర్గానికి ప్రమాదం కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కార్మిక విధానాలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ ఎండి అజ్జు, రాచపల్లి సరోజన, బోరగాల రాజ్ కుమార్, కడారి నర్సయ్య, రాజ్ కుమార్, రామగిరి సులోచన, రెంటాల రాజేశ్వరి, ఆశ యూనియన్ నేతలు తాడూరి లత, కాలేశ్వరం పుష్పలత, జంగ రమాదేవి, ఎడమల్ల సుజాత, ముషం విజయలక్ష్మి ,హమాలి యూనియన్ అధ్యక్షులు కొంకట చంద్రయ్య, కనకం రాజు, రాచపల్లి శంకర్, రవి, మాట్ల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!