
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బీజేపీ హుజురాబాద్ పట్టణ శాఖ అధ్యక్షులు గంగిశెట్టి రాజు అధ్యక్షతన అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలు, బాలింతలు, రోగులకు పండ్ల పంపిణీ చేశారు. బండి సంజయ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఈ సందర్భంగా నేతలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సినియర్ న్యాయవాది కేసరి శేషయ్య, కౌన్సిలర్ పైళ్ల వెంకట్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి తూర్పాటి రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు రావుల వేణు, సీనియర్ నాయకులు కొలిపాక శ్రీనివాస్, ఎండి అజార్, పట్టణ ఉపాధ్యక్షులు యాంసాని శశిధర్, అంకతి వాసు, యాళ్ల సంజీవరెడ్డి, పోతుల సంజీవ్, శక్తి కేంద్ర ఇంచార్జులు కొలిపాక వెంకటేష్, ఓబిసి మోర్చా పట్టణ అధ్యక్షులు గంట సంపత్, బూత్ అధ్యక్షులు యాట రాజేష్, గుండేటి భార్గవ్, సదయ్య, దేవేంద్ర, కుసుమ సమ్మయ్య, చత్తర్ సింగ్, లక్ష్మి, రాజేష్, తూర్పాటి రామచంద్రం, హరీష్, గాజుల శ్రీనివాస్, కొయ్యాడ రాజేష్, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.







