
స్వర్ణోదయ ప్రతినిధి, హైదరాబాద్: కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. తప్పకుండా అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభించి పూర్తి అయ్యో లాగా చూస్తా అని భరోసా ఇచ్చారని రాజేందర్ రావు తెలిపారు.






