
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్ జులై 12: తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి ‘అమ్మ మాట- అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో రెండున్నరేళ్లు దాటిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లోని ప్రీప్రైమరీ పాఠశాలల్లో చేర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కొత్తగా ప్రీ ప్రై మరీ సిలబస్‌ను సిద్ధం చేసింది. చిన్నారుల్ని గుర్తించి ఈ ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో చేర్చించేందుకు ఈ నెల 15 నుంచి 20 వరకు అమ్మ మాట- అంగన్వాడీ బాట పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపడుతోంది. ఈ కార్యక్రమం చివరిరోజున సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించనుంది. ఇప్పటికే అంగనవాడి టీచర్లతో ఐసిడిఎస్ అధికారులు సమావేశాలు నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.






