
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ జమ్మికుంట పట్టణ ప్రజలకు తేదీ 13-07-2024 శనివారం రోజున హుజురాబాద్-జమ్మికుంట సబ్ స్టేషన్ లలో విద్యుత్ మరమ్మతు దృష్ట్యా ఉదయము 10:00 గంటల నుండి 12:00 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపి వేయబడుతుందని విద్యుత్ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున హుజురాబాద్, జమ్మికుంట పట్టణంల మొత్తం మరియు బోర్నపల్లి కొత్తపల్లి ప్రజలు సహకరించాలని విద్యుత్ శాఖ హుజూరాబాద్ టౌన్ ఏ ఈ ఏం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.







