
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: సూర్యపేట జిల్లా, పెన్ పాడ్ మండలం, దోసాపాడు గ్రామంలో ఉన్న మహాత్మాజ్యోతిబా పూలే రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న 5వ తరగతి విద్యార్ధిని సరస్వతి ఆకాల మరణం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ద్రిగ్బాంతిని వ్యక్తం చేశారు. సరస్వతి మరణం పట్ల తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సరస్వతి మృతికి గల కారణాలపై విచారణ జరపాలని గురుకుల సెక్రటరీ సైదులు ని ఆదేశించారు. విషయం తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సరస్వతి కుటుంబానికి తక్షణ సాయంగా కింద రూ. 2 లక్షల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు. వారి ఇంట్లో ఒకరికి బీసీ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ (MJPBCREIS)లో ఉద్యోగాన్ని కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. సరస్వతి కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.






