
స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. విద్యుత్ పై ఏర్పాటుచేసిన జస్టిస్ నరసింహారెడ్డి విచారణ కమిషన్ చైర్మన్ ను మార్చాలని సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఆదేశించారు. సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్ పై మంగళవారం విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ డివై.చంద్రచూడ్ విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని తప్పు పట్టారు. తక్షణం విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని ఆదేశించగా మధ్యాహ్నం రెండు గంటలకల్లా నూతన చైర్మన్ పేరును చెప్తామనీ తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది స్పష్టం చేశారు.
