
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా ఎదురుగా పాపారావు బొందలో సోమవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో చిరు వ్యాపారుల, పండ్ల దుకాణదారుల వస్తువులు, బండ్లు అగ్నికి కాళీ బూడిద అయ్యాయని, వాటిని పరిశీలించిన హుజురాబాద్ సింగిల్ విండో చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. రెక్క ఆడితే డొక్కాడని స్థానిక చిరు వ్యాపారుల దుకాణాలు అగ్ని ప్రమాదానికి గురికావడం ఎంతో బాధాకరమన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన దానిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధిత చిరు వ్యాపారులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. తాత్కాలికంగా తిరిగి దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం మంజూరు చేసి ఆదుకోవాలని కొండాల్ రెడ్డి డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు నామమాత్రంగా వచ్చి చూడడం గాకుండా ఆర్థికంగా ఆదుకునేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బాధితులను ఆర్థికంగా ఆదుకునేలా కృషి చేయాలని కొండాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి అగ్ని ప్రమాదాలు మరోసారి భవిష్యత్ లో జరగకుండా ప్రభుత్వం, స్థానిక బల్దియా పాలకవర్గం తగిన చర్యలు తీసుకోవాలని కొండాల్ రెడ్డి సూచించారు.

