
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలోనీ వివిధ మండలాలలో గల రైతు వేదికలు రుణమాఫీ కోసం సిద్ధమయ్యాయి. గురువారం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ చేస్తున్నది విధితమే. ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మొదటి విడతగా లక్ష లోపు రుణమాఫీకి సుమారు 12,000 మంది రైతులు ఉన్నట్లు అధికారుల నివేదికలు తెలుపుతున్నాయి. అందులో భాగంగా రేపు హుజురాబాద్, తనుగుల, చల్లూరు, ఇల్లందకుంట రైతు వేదికలలో రుణమాఫీ సంబరాలు జరుపుకొనున్నారు. హుజురాబాద్ మండలం తీసుకున్నట్లయితే లక్ష లోపు రుణమాఫీకి 2518 మంది రైతులను అధికారులు గుర్తించారు. ఇందులో చెల్పూర్ పరిధిలో 467 మంది, హుజురాబాద్ పరిధిలో 636 మంది, కందుగుల పరిధిలో 625 మంది, సింగాపూర్ పరిధిలో 468 మంది, సిర్సపల్లి పరిధిలో 322 మంది రైతులు లక్ష లోపు రుణమాఫీకి అర్హులుగా గుర్తించారు. రేపు సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనగా ప్రారంభించి టీవీ మానిటర్ ద్వారా రైతులను ఉద్దేశించి మాట్లాడాను అన్నారు. అందుకని రైతు వేదికల వద్ద వ్యవసాయ అధికారులు మానిటర్ లను సిద్ధం చేసి రైతులు కూర్చుని తిలకించేలా కుర్చీలను గ్రహించి అన్ని ఏర్పాట్లను వేదికల వద్ద సిద్ధం చేసి వాటిని ముస్తాబు చేస్తున్నారు. మొదటి విడతగా రేపు లక్ష లోపు రుణమాఫీ చేయనుండగా ఈ నేలాఖరు వరకు లక్షన్నర లోపు రుణమాఫీ, వచ్చే నెలలో రెండు లక్షల రుణమాఫీ మూడు విడుతలుగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు రైతుల ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించి ఈ విషయాన్ని టీవీ మానిటర్ ద్వారా రైతులకు ముఖ్యమంత్రి వివరిస్తారు. సీఎం ప్రసంగాన్ని వీక్షించేలాగా వ్యవసాయ అధికారులు రైతు వేదికల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. లక్ష రూపాయల రుణమాఫీ ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం రైతులు తో కలిసి అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకునేలా సీఎం కార్యక్రమాన్ని రైతు వేదికల ద్వారా విజయవంతము చేసేందుకు హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ ఇప్పటికే కాంగ్రెస్ నాయకులకు దిశ నిర్దేశం చేశారు. రైతు ఉత్సవాల సంబరాలలో భాగంగా రైతులకు కాంగ్రెస్ నాయకులు స్వీట్లు పంపిణీ చేస్తారనీ, హుజురాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాల రైతు వేదికలకు వచ్చిన రైతులతో రుణమాఫీ సంబరాల్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల ప్రణవ్ పాల్గొంటారనీ సమాచారం.







