
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: జమ్మికుంట పట్టణంలోని ఆబాది జమ్మికుంటలో గొల్ల కురుమ కులస్తులు తమ ఆరాధ్య కుల దైవమైన బీరప్ప దేవునికి డప్పు చప్పులతో నృత్యాలు చేస్తూ, మహిళలు నెత్తిన బోనాలను ఎత్తుకొని దేవాలయంలో మొక్కలు సమర్పించారు. అనంతరం బీరప్ప దేవాలయ ఆవరణలో కౌన్సిలర్ దయ్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. పిల్లాపాపలతో కుటుంబ సభ్యులందరినీ చల్లగా చూడు తండ్రి అని బీరప్ప దేవుని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ గొల్ల కురుమ కులస్తులు, కుల పెద్ద మనుషులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


