
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: రాబోయే కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రైవేటు విద్యాసంస్థల, ఉపాధ్యాయుల సమస్యల కోసం తీవ్రంగా కృషి చేస్తున్న ట్రస్మా రాష్ట్ర నాయకులు యాదగిరి శేఖర్ రావుకు విద్యావంతులు ఈసారి అవకాశము ఇవ్వాలని ట్రస్మా హుజురాబాద్ అధ్యక్షుడు వకులాభరణం వెంకటేశ్వర్లు కోరారు. గురువారం ఆయన హుజురాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ.. గత పట్టభద్రుల ఎన్నికల సమయంలో పోటీ చేయడానికి ముందుకు వచ్చిన యాదగిరి శేఖర్ రావును అప్పటి ఉద్యోగ సంఘ నాయకుడు మామిళ్ల చంద్రశేఖర్ గౌడ్ కు మద్దతుగా ఉపసంహరించుకున్నారని తెలిపారు. రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో ప్రైవేటు విద్యాసంస్థల, ఉపాధ్యాయుల నిరుద్యోగుల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న యాదగిరి శేఖర్ రావు అభ్యర్థి అయితే సమస్యలు ప్రభుత్వంతో పోట్లాడి పరిష్కరిస్తారని అందుకే ట్రస్మా ఆయనకు మద్దతు నిస్తుందని ఆయన చెప్పారు. పట్టభద్రుల నియోజకవర్గాలలో ఉన్న అన్ని ట్రస్మా సభ్యులు, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులంతా ఆయనకు మద్దతుగా నిలుస్తారని తెలిపారు. ఈ సమావేశంలో ట్రస్మా హుజురాబాద్ నియోజకవర్గం నాయకుడు బత్తుల రాజ్ కుమార్, జిల్లా నాయకుడు మాడిశెట్టి ప్రసాద్, హుజురాబాద్ ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, కోశాధికారి కోటేశ్వర్ యాదవ్, విజయపాల్ రెడ్డి, గోపాల్, ఏం వెంగళరావు, తిరుపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






