
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: రాష్ట్ర మాజీ మంత్రి, స్వర్గీయ ముద్దసాని దామోదర్ రెడ్డి సేవలు మరువలేనివని సీనియర్ సిటిజన్, రైతు ప్రజా సంఘాల జాతీయ నాయకుడు పోలాడి రామారావు పేర్కొన్నారు. శనివారం దామోదర్ రెడ్డి 68వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు, కమలాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి, రైతుల సమస్యల పరిష్కారానికి విశేష సేవలందించిన గొప్ప నాయకుడు దామోదర్ రెడ్డి అని అన్నారు.
జిల్లా ప్రజలందరికీ అర్ధ రాత్రి వరకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించి, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆపదలో అండగా నిలిచిన కీ. శే. దామోదర్ రెడ్డి లాంటి నాయకులు నేడు చాలా అరుదని చెప్పారు. స్వర్గీయ దామోదర్ రెడ్డిని సామాన్య ప్రజలు, కార్యకర్తలు జిల్లా టైగర్ గా పిలుచుకునే వారని అన్నారు. రాష్ట్రంలోనే అప్పటి కమలాపూర్ , ఇప్పటి హుజురాబాద్ నియోజకవర్గానికి గుర్తింపు తెచ్చిన ఘనత దామోదర్ రెడ్డికే దక్కుతుందన్నారు, 29 ఏళ్లకే ఎమ్మెల్యేగా 30ఏళ్లకే మంత్రిగా కరీంనగర్ జిల్లాలో 1985నుండి 2004 వరకు వరుసగా 4సార్లు ఎమ్మెల్యేగా 3సార్లు మంత్రిగా ఎన్నికైన ముద్దసాని బడుగు బలహీవర్గాల ఆశాజ్యోతిగా భూస్వాములు, పెత్తందార్ల పాలిట సింహ స్వప్నంగా, కమలాపూర్ కుర్రోడు అని అందరూ ముద్దుగా పిలిచే పేద, బడుగు బలహీనర్గాల నాయకులను తయారు చేసిన నాయకుడు స్వర్గీయ ముద్దసాని దామోదర్ రెడ్డి అని కొనియాడారు.
దామోదర్ రెడ్డి లేని లోటు తీర్చలేనిదని, ఆయన ఆశయాలను నేటి యువత , ఆదర్శంగా తీసుకోవాలని పోలాడి రామారావు కోరారు. చంద్రబాబు మీద నాకు అన్న అభిమానంతో నా ప్రత్యేక విన్నపం మేరకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, నేటి విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని 2000సం. మే నెల 12వ తేదీన కరీంనగర్ జిల్లా, మానకొండూరు మండ లంలోని మా స్వగ్రామం వన్నారం గ్రామానికి దామోదర్ రెడ్డి రప్పించి కరీంనగర్ . వరంగల్ ప్రధాన హైవే గట్టుదుద్దెనపల్లి గ్రామం నుండి మా వన్నారం గ్రామం మీదుగా ఏరడపల్లి, అర్కండ్ల, గంగారం, ఎల్బాక, చల్లూర్ గ్రామం వరకు 14 కి. మీ. బీటీ రోడ్ నిర్మాణం పనిని చంద్రబాబుతో మంజూరి చేయించి దామోదర్ రెడ్డి పూర్తి చేయించారని, మానకొండూరు, శంకరపట్నం, వీణవంక మండలాల రైతులకు ఈ రోడ్ నిర్మాణంతో ఎంతో మేలు చేకూరుతుందని రామారావు గుర్తు చేశారు. డాషింగ్, డేరింగ్, డైనమిక్, మాస్ లీడర్ గా స్వర్గీయ ముద్దసాని దామోదర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.







