
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: కొద్ది రోజుల క్రితం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ఐన తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, ఎర్రంరాజు సురేందర్ రాజులు కెనాల్ కాంట్రాక్ట్ వర్క్ లో పార్ట్నర్ గా చేర్చుకుంటామని చెప్పి రూ .82 లక్షల రూపాయలు తీసుకొని ఎలాంటి పని అప్పగించకుండా తిప్పుకుంటుండగా డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు చంపుతామని బెదిరించినారని డబ్బులు తీసుకొని మోసం చేసినారని ఆబాది జమ్మికుంట నివాసి బాసని పాపిరెడ్డి అనే వ్యక్తి స్థానిక కోర్టులో ఫిర్యాదు చేయగా కోర్టు ఆదేశాలతో శనివారం రోజు సదరు ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి తెలిపారు. సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.






